ఫిబ్రవరి 23న రఘుకు మరణశిక్ష

అమెరికాలో 2012 లో చిన్నారి శాన్విని, ఆమె అమ్మమ్మను దారుణంగా హతమార్చిన కేసులో యండమూరి రఘునందన్‌కు మరణశిక్ష తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 23 న అతనికి మరణశిక్ష విధించాలని జైలు అధికారులు నిర్ణయించారు. ఇది అమలైతే యూఎస్ లో ఈ శిక్షకు గురైన తొలి భారత సంతతి వ్యక్తి అవుతాడు రఘు.

అయితే ఇతని శిక్ష వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. పెన్సిల్వేనియాలో మరణశిక్షపై నిషేధం అమల్లో ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆ రాష్ట్ర గవర్నర్ ఈ బ్యాన్ ను సడలిస్తే తప్ప..రఘుకు శిక్ష అమలు చేయలేరని అంటున్నారు.2014 లో ఇతనికి మరణ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

 

Related News