ఉసురు తీసిన అతివేగం.. యాదాద్రి వద్ద దారుణం!

యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. పరీక్షలు రాయడానికి స్కూటర్‌పై వెళ్తున్న ముగ్గురు విద్యార్థుల్ని ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. రోడ్డు క్రాస్ చేసే సమయంలో మరోవైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో.. టూవీలర్‌తో పాటు ముగ్గురు విద్యార్థులూ గాల్లో ఎగిరి కింద పడ్డారు. బీబీనగర్ మండలం కొండమడుగు వద్ద ఈ ఘటన జరిగింది. వెంటనే బాధితుల్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు. మృతుడు భువనగిరి సమీపంలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజ్‌లో చదువుతున్నాడు.

 

Related News