AP / Politics
పవర్‌స్టార్‌పై ఫైర్‌బ్రాండ్ రోజా తీవ్ర వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా. వారసత్వ రాజకీయాలపై పవన్ చేసిన వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు ఆమె. సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి లేకుంటే పవన్ ఎక్కడ వుండేవారని ప్రశ్నించారు. పవన్‌తో ఎవరు సినిమాలు చేస్తారు..? ఎవరు చూస్తారని మండిపడ్డారు. ఇప్పుడున్న మెగా హీరోలంతా.. చిరు కష్టాన్ని వాడుకుని పైకి వచ్చిన వాళ్లేనని ఒక్కమాటలో తేల్చేశారు. కాబట్టి వారసత్వంగా కొంతమందికి అవకాశాలొస్తాయని, ఆ తర్వాత వాళ్లు తమ టాలెంట్‌ని నిరూపించుకోవాలన్నారు. మరోవైపు రోజా వ్యాఖ్యలపై మెగా హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ.. మెగా హీరోల గురించి ఎందుకు ప్రస్తావించారని, మీడియాలో హైలైట్ కావాలనే ఈ విధంగా వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

 

వైఎస్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్, ఆ తర్వాత జన హృదయాలను గెలుచుకున్నారని, పవన్ మాత్రం టైమ్ పాస్ రాజకీయాలు చేస్తూ ఎవరో రాసిచ్చిన స్ర్కిప్ట్ చదువుతారని ఆరోపించారు. ఐనా, పవన్ ప్రశ్నించాల్సింది ప్రభుత్వాన్ని కానీ, ప్రతిపక్షనేత జగన్‌ని కాదని తెలిపారు. 

 

Read Also

 
Related News