AP / Politics
లక్ష్మీస్ రోజా.. స్పెషల్ ఎపిసోడ్

జనరేషన్లు వేరైనా.. ఏజ్ గ్యాప్ ఎంతున్నా.. వైసీపీలో వాళ్లిద్దరికీ వుండే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ మాత్రం గొప్పదే! పార్టీని డిఫెండ్ చేయడంలో ఒకర్ని మించి మరొకరు పోరాడే లక్ష్మీపార్వతి, రోజాల పాత్ర జగన్ పార్టీలో చాలా క్రూషియల్. మరి వీళ్లిద్దరు ఒక చోట చేరితే..!

 

అదేనండి.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం స్టేటస్ రిపోర్ట్ కోసం సైట్‌కి టూరేసిన వైసీపీ నేతలు స్పెషల్ బస్సులో హంగామా చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేని పరిస్థితిలో గెట్‌టు‌గెదర్లు లేక కొన్నాళ్లుగా ఎవరికివారుగా సైలెంట్‌గా ఉండిపోయారు. ఇప్పుడు పార్టీలో కీలక నేతలంతా ఒక్కచోట చేరే సందర్భం వచ్చేసరికి వాళ్లలో జోష్ పెరిగింది. ఈ క్రమంలో వైసీపీ బస్సులో తెగ హడావుడి చేశారు రోజా, లక్ష్మీపార్వతి. సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు. లక్ష్మీపార్వతి కూడా కాసేపు వయసుని మరిచిపోయి అందరితో కలివిడిగా మెలిగారు.

 

Read Also

 
Related News