India / General
ఆడశిశువుకు జన్మనివ్వడం నిజమే.. జయలలిత తండ్రిది హత్యే..

తమిళనాట అమ్మగా కీర్తించబడిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం కూడా అనేక మిస్టరీలకు కేంద్రమవుతున్నారు. ఇప్పటికే ఆమె సినీ, రాజకీయ జీవితంలో ఎన్నో టాప్ సీక్రెట్స్. అటామె మరణం కూడా పెద్ద మిస్టరీనే. ఇప్పుడిక ఆమె సంతానమెవరనేది మరో పెద్ద సబ్జెక్ట్ అయింది. ఇటీవల అమృత అనే అమ్మాయి సుప్రీంకోర్టుకెళ్లి.. కావాలంటే డీఎన్ఎ పరీక్ష జరపండి తానే జయ కూతుర్నంటూ వాదించింది. అంతే, అప్పటినుంచీ జయ కుటుంబసభ్యుల నుంచే జయ పర్సనల్ విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. జయకు ఒక కూతురు పుట్టిన మాట వాస్తవమేనంటూ ఫ్యామిలీ మెంబర్సే చెబుతున్నారు. ఇటీవలే జయ స్నేహితురాలు గీత సంచలన విషయం బయటపెట్టారు. తనకు- జయకు అమృత అనే కూతురు ఉందని సాక్షాత్తూ శోభన్ బాబు తనకు చెప్పారని గీత వెల్లడించారు.

 

తాజాగా బెంగళూరులో నివసిస్తోన్న జయలలిత అత్తకూతురు లలిత మరో బాంబు పేల్చారు. జయ ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చిన మాట వాస్తవమేనని, ఆమె పెద్దమ్మే పురుడుపోశారని కూడా చెప్పారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని తమదగ్గర ప్రమాణం చేయించుకున్నారన్నారు. అయితే, ఆ బిడ్డకు తండ్రి ఎవరన్నది తెలీదని లలిత టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు, జయలలిత తండ్రి జయరామన్ ది కూడా హత్యేనని.. భార్య సంధ్యే చంపేసిందని ఆమె మరో సంచలన విషయం చెప్పారు. జయరామన్ మద్యానికి బానిస కావడంతో జయ తల్లే భర్తకు విషమిచ్చి చంపిందని ఆమె ఆరోపించారు. జయలలిత అహం భరించలేక, జయరామన్ హత్య వంటి ఘటనలతో తామంతా దూరంగా వెళ్లిపోయామని లలిత అప్పటి విషయాల్ని గుర్తుకు తెచ్చుకున్నారు.

 

Read Also

 
Related News