AP / general news
రూ. 700 మాత్రమే..! తిరుగుప్రయాణం 'రద్దు'
సరదాగా అలా వెళ్ళొద్దామా?.. వీకెండ్స్ లో తరచూ వినిపించే మాట! ఆరురోజుల శ్రమకూ కలిపి దొరికే ఆ ఒక్కరోజూ విరామాన్ని.. ఆహ్లాదంగా స్పెండ్  చేద్దామన్న ఆశతో 'విహారయాత్ర'కు ఉపక్రమిస్తాం. ఇటువంటి అలవాటునే ఇవాళారేపూ 'ఔటింగ్' అంటూ కొత్తగా పిలుచుకుంటాం. మళ్ళీ సోమవారం పొద్దునకల్లా ఎవ్వరిళ్లకు వాళ్ళు వచ్చేయొచ్చన్న గట్టి సంకల్పమే ఈ ప్రయాణాలకు పురిగొల్పుతుంది. ఇటువంటి విహారయాత్ర ఆలోచనే ఆ 21 మంది బతుకుల్నికడతేర్చింది. కృష్ణా నదిలో జరిగిన ఘోర పడవ ప్రమాదం.. దాని నేపథ్యం గురించి ఇప్పుడు అందరూ ఆరా తీస్తున్నారు. 
ఇక్కడ మృతుల్లో అధికపక్షం ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వారే! ఒంగోలు వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వీళ్లంతా కలిసి సండే టూర్ ప్లాన్ చేశారు. రంగరాయచెరువు ప్రాంతంలో పనిచేసే వాకర్స్ క్లబ్ కు చెందినవాళ్లంతా.. కార్తీక మాస వనవిహార యాత్ర పేరుతో నెలరోజుల ముందుంచే ఈ ప్లాన్ వేసుకున్నారు. రానూపోనూ ఖర్చు రూ. 700 మాత్రమే అంటూ పోస్టర్ వేసిమరీ ఈ టూర్ కి ప్రచారం చేసుకున్నారు. నలభై ఏళ్ల వయసు దాటినవాళ్ళే అందరూ. రిటైర్డ్ ఉద్యోగులే వీళ్ళలో ఎక్కువమంది. ఒక్కరోజే కదా.. అందులోనూ ఆదివారమాయె.. అనుకుంటూ కుటుంబంలోని మిగతావాళ్ళను కూడా తోడుకెళ్లిన వాళ్ళూ వున్నారు. వాకర్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మొదలైన ఈ యాత్ర చివరికిలా విషాదాంతమైంది. ఇప్పుడీ రంగరాయచెరువు ప్రాంతంలోని అన్ని వీధులూ ఏడుపులుపెడబొబ్బలతో నిండిపోయాయి. 
 

Read Also

 
Related News