AP / general news
బోటు ట్రాజడీ.. అంతా కుమ్మక్కయ్యారా?

కృష్ణానది పడవ ఘటనలో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. విజయవాడ టూరిజం శాఖకు చెందిన ఉద్యోగి గంగరాజు, కార్మికసంఘం అధ్యక్షుడు వీరారెడ్డి, భవానీ ద్వీపం మాజీ మేనేజర్ శ్రీధర్ కొల్లి, టూరిజం శాఖ డ్రైవర్ గేదెల శ్రీనివాసరావు, పెమ్మడి నరసింహతోనూ కలిసి రివర్ బోటింగ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. టూరిజం శాఖ ఎండీ నుంచి అనుమతి లేనప్పటికీ ఈ కంపెనీ పున్నమి వద్ద వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తోందని, తన సొంత టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్టు సమాచారం. తమ సంస్థ ప్రయోజనాల కోసం గంగరాజు పున్నమి వద్ద అమరావతి బోట్ క్లబ్‌కు కేటాయించిన సీ ప్లెయిన్ జెట్టీని ఇతరత్రాలను అనుమతి లేకుండా తొలగించి దుర్గాఘాట్ వద్ద ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించినట్టు తెలుస్తోంది.

 

Read Also

 
Related News