India / Crime
ఉబెర్ ఆగడాలు.. ప్రయాణికుడ్ని చితక్కొట్టిన డ్రైవర్లు

ఉబెర్ క్యాబ్ డ్రైవర్ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. తాజాగా బెంగళూరులో ఓ ప్రయాణికుడిని ఉబెర్ క్యాబ్
డ్రైవర్లు కలిసి చితకబాదారు. గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. ఈ ఘటన సోమవారం
రాత్రి బెంగళూరు కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. 

 

లొకేషన్.. బెంగళూరు.. సమయం.. రాత్రి 11 గంటలు.. వాహనం.. ఉబెర్ క్యాబ్.. ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ సీఈఓ
అయిన 48 ఏళ్ల దేవ్‌బెనర్జీ.. తన క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి బెంగుళూరు సిటీ నుంచి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్నారు. ఐతే, సీటు బెల్ట్
విషయంలో డ్రైవర్‌తో గొడవ కాస్త తీవ్రరూపం దాల్చింది. ఈలోగా డ్రైవర్.. మిగతా క్యాబ్ డ్రైవర్ల సాయంతో ప్రయాణికుడిపై
దాడి చేసి చితకబాదారు. ఈ గొడవ దాదాపు 45 నిమిషాల సేపు జరిగింది. కారు ఎక్కాక సీటు బెల్టు కనిపించకపోవడంతో డ్రైవర్‌ని అడిగానని, అతడి నుంచి సమాధానం రాకపోవడంతో మరోమారు ప్రశ్నించినట్టు చెప్పారు. చివరకు కారు ఆపి లోపలున్న సీటు బెల్టు ఇవ్వాలని చెప్పినట్టు దేవ్ వివరించారు. డ్రైవర్ వాదన మరోలావుంది.. దేవ్ తొలుత తనపై దాడి చేయడంతో తోటి డ్రైవర్ల సాయం తీసుకున్నానని తెలిపాడు. ఈ దాడిలో తనతోపాటు సహచరుడు కూడా గాయపడినట్టు తెలిపారు దేవ్.

ఈ ఘటనపై ఉబెర్ సంస్థకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు బాధితుడు. త్వరలోనే డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసి సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఉబెర్ సంస్థ, ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల భద్రతే తమ ఫస్ట్ ప్రయార్టీ అని, డ్రైవర్-ప్రయాణికుడి మధ్య సత్సంబంధాలనే కోరుకుంటామని,  ఈ కేసు దర్యాప్తు విషయంలో సహకరిస్తామని తెలిపింది.

 

Read Also

 
Related News