India / Entertainment
‘టైగర్ జిందాహై’ ట్రైలర్

సల్మాన్‌ఖాన్‌- కత్రినాకైఫ్ జంటగా బాలీవుడ్‌లో రానున్న ఫిల్మ్ ‘టైగర్‌ జిందాహై’. ఈ చిత్రానికి సంబంధించి మూడు నిమిషాల ట్రైలర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. ఇటీవలికాలంలో ఐసిస్ ఉదంతాలను ఇందులో కళ్లకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్.

ఐదు దేశాల్లో చిత్రీకరణ జరిగిన ఈ చిత్రం ‘ఏక్ థా టైగర్‌’‌కి సీక్వెల్. ఇక యాక్షన్ సీన్స్‌ మూవీకే హైలైట్ అని అంటున్నారు. ఎంజీ42 అనే మెషీన్‌గన్‌ని సల్మాన్‌ వినియోగించాడట. దీని బరువు 25-30 కిలోల వరకు ఉంటుంది. మూడు రోజులు పాటు షూట్ చేసిన యాక్షన్‌ సీన్స్‌లో  ఏకంగా 5000 వేలకు పైగా తూటాలను సల్మాన్ కాల్చినట్లు యూనిట్ చెబుతున్న మాట.

 

Read Also

 
Related News