AP and TS / Entertainment
లక్ష్మీపార్వతి చంపుతానంటోంది!

'లక్ష్మీస్ వీరగ్రంధం' డైరెక్టర్ కి ప్రాణభయం పట్టుకుంది. ఎన్టీయార్ పై తానూ బయోపిక్ తీస్తానంటూ ముందుకొచ్చి.. వివాదంలో చిక్కుకున్న కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డికి.. ఇప్పుడు 'సినిమా కష్టాలు' మొదలయ్యాయి. తొలి క్లాప్ కొట్టడానికి హైదరాబాద్ లోని ఎన్టీయార్ ఘాట్ వద్దకెళితే.. అడ్డుకున్నారని, నిమ్మకూరులో షూట్ పెట్టుకుంటే అక్కడా అనుమతివ్వలేదని వాపోతున్నారు. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంటి పనుల్ని దిగ్విజయంగా ముగించుకున్న కేతిరెడ్డి.. ఇప్పడు గ్రౌండ్ లెవల్లో దిగేసరికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. దీనంతటి వెనుక లక్ష్మిపార్వతే వుందన్నది కేతిరెడ్డి అభియోగం. అప్పట్లో రాజ్యాంగేతర శక్తిగా మారి ఎన్టీయార్ జీవితాన్ని ప్రభావితం చేసిందని, ఇప్పుడు కూడా తన పలుకుబడి ఉపయోగించి సినిమాను అడ్డుకుంటోందని ఆరోపించారాయన. చంపుతామంటూ కొన్నిరోజులుగా బెదిరింపులు కూడా వస్తున్నాయని కేతిరెడ్డి ఒక వీడియో ద్వారా వెల్లడించారు. తనకు, తన సినిమా ప్రొడ్యూసర్ కు పోలీస్ సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేశారాయన. ఇందుకోసం డీజీపీని కలిసి విన్నవించుకుంటానని కూడా చెప్పారు.

 

Read Also

 
Related News