AP / Entertainment
చివరికి గెలిచిందెవ్వరు? నంది అవార్డులకు 'కమ్మ' కలర్ !

మూడేళ్లకు కలిపి ఏపీ సర్కార్ ఒకేసారి ప్రకటించిన నంది పురస్కారాల జాబితా ఒక అతుకుల బొంతలా వుంది. ప్రావీణ్యత పాళ్ళకంటే, ప్రామాణికాల కంటే మించి అక్కడ ఆశ్రిత పక్షపాతమే ఎక్కువగా కనిపించిందంటూ అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. జ్యురీ మెంబర్లు అన్ని వర్గాల మధ్య సమతుల్యం పాటించాలన్న భీకరమైన కసరత్తు చేసుకున్నప్పటికీ.. తుది ఫలితంలో మాత్రం డొల్లతనాన్ని దాచిపెట్టుకోలేక పోయారు.

 

'గోదావరి పుష్కరాలు' మీద తీసిన లఘుచిత్రానికి బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు రావడం, 'నీరు-చెట్టు' ప్రభుత్వ కార్యక్రమ చిత్రానికి బెస్ట్ ఎడ్యుకేషనల్ ఫిలిం పురస్కారం రావడం.. ఇటువంటివన్నీ ఉపేక్షించదగ్గవే. కానీ.. అవార్డుల ఎంపికలో అధికార పార్టీ జోక్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందంటూ కామెంట్లు పడిపోతున్నాయి. పేరుపేరునా ప్రస్తావించడం ఎందుకు.. ఒక్కసారి పురస్కార గ్రహీతల జాబితాను పరిశీలించండి.. అందులో ఎవరెవరు ఏయే కులం.. ఏఏ కులాలకు ఎన్నెన్ని అవార్డులు.. అల్టిమేట్ గా లాభపడ్డ కులం ఏది.. అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈసారి నంది అవార్డుల్లో 'కమ్మదనం' ఎక్కువైందని లెక్కలేసి మరీ చెబుతున్నారు. ఉగాది పచ్చడిలా షడ్రుచుల సమ్మేళనంగా ఉండాల్సిన 'నందుల సంబరం' ఇలా ఏకపక్షంగా కనిపించడం మధ్యేవాదులకు రుచించడం లేదట! ఎందుకో.. తెలుగు సినిమా నొచ్చుకుంటోంది!

 

Read Also

 
Related News