India / Entertainment
చివరకు దిగొచ్చిన టబు.. బట్ కండిషన్స్ అప్లై..!

నటి టబు మనసు మార్చుకుంది. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా కనిపించాలని ఆరాటపడుతోంది. అంతేకాదు ఓపెన్
గా తన మనసులోని మాటను బయటపెట్టేసింది. గతంలో రియాల్టీ షోలు చేయాలంటూ ఆఫర్స్ వచ్చాయని, కానీ.. ఆ షోలు అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదని, ఇపుడు వీలైతే రియాల్టీ షోకు జడ్జిగా చేయాలనుందని వెల్లడించింది. అంతేకాదు తనకు ట్రావెలింగ్‌కు సంబంధించిన షో  అయితే ఇంకా ఇష్టమని చెప్పింది.

 

ట్రావెల్ ద్వారా సరికొత్త ప్రపంచాన్ని చూడొచ్చు, చుట్టి రావచ్చని అంటోంది టబు. తొలుత తాను ఎయిర్‌హోస్టెస్‌ను కావాలనుకున్నానని.. ఇప్పుడు సౌత్ అమెరికా, ఆస్ట్రేలియాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ట్రావెల్ చేయాలని వుందని తెలిపింది. టబు నటించిన ‘గోల్‌మాల్ ఎగెయిన్’ మూవీ సందర్భంగా మీడియాతో చిట్‌చాట్ చేసి ఈ విషయాన్ని రివీల్ చేసింది.

 

Read Also

 
Related News