AP and TS / Entertainment
పట్టాలెక్కిన చిరు ‘సైరా’

ఎట్టకేలకు చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘సైరా’ బుధవారం సెట్స్‌పైకి వెళ్లింది. చిరు కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ ఫిల్మ్ హైద‌రాబాద్‌ కొండాపూర్‌లోవున్న అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతోంది. చిరుతోపాటు ప‌లువురు విదేశీ జూనియ‌ర్ ఆర్టిస్టుల‌పై స‌న్నివేశాల‌ను డైరెక్టర్ సురేందర్ రెడ్డి చిత్రీకరించాడు.

కెమెరామన్‌గా రత్నవేలుని తీసుకున్నారు. 1840 నాటి స్టోరీ కావడంతో అందుకు తగ్గట్టుగా సెట్‌ని డిజైన్ చేశాడు ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్. హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత పొలాచ్చి, రాజస్థాన్‌లతోపాటు ప‌లు ప్రాంతాలలోను చిత్రీకరణ జరగనుంది. దాదాపు 100 కోట్లపైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అమితాబ్, జగపతిబాబు, సుదీప్, నయనతార ప్రధాన పాత్రలు పోషించనున్నారు. రామ్‌చర‌ణ్ ప్రొడ్యూసర్. సెట్స్‌పైకి వెళ్లడం తొలిరోజు కావడంతో కొన్ని పిక్స్‌ని యూనిట్ సభ్యులు అభిమానులతో షేర్ చేసుకున్నారు.


 

Read Also

 
Related News