World / General
ఇవాంకా టూర్ : వైట్ హౌస్‌కి, ఎస్పీజికి మధ్య చిచ్చు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ భద్రత చర్చనీయాంశంగా మారింది. వైట్ హౌజ్ భద్రతా కార్యాలయం జారీ చేస్తున్న ఆదేశాలు ప్రధాని భద్రతా కార్యాలయాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి.  ఇవాంక భద్రతను తమకు వదిలేయాలని.. ఆమె సెక్యూరిటీ అంతా తాము చూసుకుంటామంటూ కేంద్ర హోంశాఖతోపాటు స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌- SPG కి స్పష్టమైన సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లో ఆమె పర్యటించనున్నారు.

ఈ నేపథ్యంలో HICCలో జరిగే ప్రపంచ పారిశ్రామిక సదస్సులోకి పోలీస్‌ అధికారులు, సిబ్బంది ఆయుధాలతో ప్రవేశించేందుకు వీల్లేదని అమెరికా సెక్యూరిటీ వింగ్‌ స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే ఇవాంక ట్రంప్‌ భద్రతతోపాటు దేశ ప్రధాని మోడీ భద్రత కూడా ముఖ్యమని, ఆయన వెనక సాయుధ సిబ్బంది ఉండాల్సిందేనని పట్టుబడుతున్నాయి కేంద్ర హోంశాఖ, ఎస్‌పీజీ. గతంలో టర్కీలో జరిగిన హైకమిషనర్‌ కాల్పుల వ్యవహారంతో అమెరికన్‌ సెక్యూరిటీ..  సదస్సులోకి ఎవరూ ఆయుధాలు తేవద్దన్న నిబంధనను పెడుతున్నట్టు కేంద్ర హోంశాఖ భావిస్తోంది. ఇవాంక ట్రంప్‌ భద్రతకు సంబంధించి అమెరికన్‌ సెక్యూరిటీయే ప్రత్యేకంగా వాహనాలు, సిబ్బందిని రంగంలోకి దించనున్నట్టు సమాచారం.

 

Read Also

 
Related News