India / General
చౌమహల్లా ప్యాలెస్ లో మోదీ, గోల్కొండ కోటలో కేసీఆర్
ఈసారి గ్లోబల్ ఇండస్ట్రియల్ సమ్మిట్‌కు హైదరాబాద్ హైటెక్స్ వేదిక! అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్‌తో పాటు 1500మంది ప్రముఖులు సదస్సుకు అటెండవుతారు. తెలంగాణ సర్కార్ ఈ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేయించాలన్న పట్టుదలతో ఉంది. ఇవాంకా ట్రంప్ భాగ్యనగరం రానున్న సందర్భంగా ఇప్పటికే ఇక్కడ బిచ్చగాళ్లని శివార్లు దాటించేశారు. ఎక్కడైనా బెగ్గర్ వున్నాడన్న సమాచారం అందిస్తే.. 5 వేలు నజరానా ఇస్తామంటూ జీహెచ్ఎంసీ ప్రకటించింది. రెండురోజులపాటు హైదరాబాద్ లో వుండే ఇవాంకా.. చార్మినార్, లాడ్ బజార్, చౌహముల్లా ప్యాలెస్‌ను సందర్శిస్తారు. చౌహముల్లా ప్యాలెస్ లోనే ప్రధాని మోదీ ఇవాంకాకు రాయల్ డిన్నర్ ఇవ్వనున్నారు. అటు.. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సదస్సుకు హాజరైన ప్రముఖులకు నవంబర్ 29న సీఎం కేసీఆర్ గోల్కొండ కోటలో విందు ఇస్తారు. 
 
ఇదిలా ఉంటే.. నవంబర్ 28 నుంచి 30 వరకు హైదరాబాద్ లో జరిగే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్.. ప్రిపరేషన్స్ జోరందుకున్నాయి. దీనికి ప్రీ-ఈవెంట్ గా నవంబర్ 26న ఏ.ఆర్.రెహమాన్‌తో మ్యూజికల్ నైట్ నిర్వహించాలన్నది ప్లాన్. ఐదేళ్ల తర్వాత రెహమాన్ ఇండియాలో ఇస్తున్న తొలి కచేరి ఇది. తన పాతికేళ్ల సంగీత ప్రస్థానంలో అన్ని సూపర్ హిట్ సాంగ్స్ నీ ఇక్కడ రెహమాన్ పాడి వినిపిస్తారట! దాదాపు 30 వేల మంది మ్యూజిక్ లవర్స్ పాల్గొనే ఈ కాన్సెర్ట్ మీద ట్రంప్ కూతురు ఇవాంకా కూడా కాన్సన్ట్రేట్ చేసిందట! రెహమాన్ షో కోసం షెడ్యూల్ మార్చుకున్నా మార్చుకోవచ్చట!
 

Read Also

 
Related News