India / Entertainment
పరిచయం ఐపోయింది.. ఇక

హీరోయిన్ శ్రుతి‌హాసన్ పెళ్లికూతురు కాబోతుందా? త్వరలో ఆమె పెళ్లి పీటలు ఎక్కనుందా? అవుననే అంటోంది కోలీవుడ్.  లండన్‌కి చెందిన నటుడు మైఖేల్‌ కోర్సేల్‌తో ప్రేమలోవున్న ఆమె, చాలాసార్లు ప్రియుడ్ని ముంబైకి తీసుకొచ్చింది. తాజాగా ఇప్పుడు మైఖేల్‌ని తన తల్లి సారికకు పరిచయం చేసింది. అందుకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

గతంలో ప్రియుడ్ని ఫ్యామిలీకి దూరంగా వుంచగా, ఈసారి ఏకంగా తల్లి వద్దకు తీసుకురావడంతో రేపోమాపో మ్యారేజ్ జరగడం ఖాయమనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. తాము మ్యారేజ్ చేసుకుంటామని శృతి ఇదివరకే తండ్రి కమల్‌హాసన్‌తో చర్చించినట్లు సమాచారం. సో.. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చేఏడాది శృతి మ్యారేజ్ చేసుకోవడం ఖాయమన్నమాట.

 

Read Also

 
Related News