AP and TS / Entertainment
సప్తగిరి ఎల్‌ఎల్‌బి మూవీ రివ్యూ

సినిమా పేరు: 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి'
విడుదల తేదీ: 07.12.2017
మ్యూజిక్: విజయ్‌ బుల్గానిన్‌
ఫొటోగ్రఫీ: సరంగం
ఎడిటింగ్‌: గౌతంరాజు
ఫైట్స్‌: విజయ్‌
రచన: పరుచూరి బ్రదర్స్‌
నిర్మాత: డాక్టర్‌ కె.రవి కిరణ్‌
బ్యానర్‌: సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
దర్శకత్వం: చరణ్‌ లక్కాకుల
నటీనటులు: సప్తగిరి.. కాశిష్‌ వోహ్రా.. సాయికుమార్‌.. శివప్రసాద్‌.. షకలక శంకర్‌ తదితరులు

 

టాలీవుడ్ కమిడియన్ సప్తగిరి హీరోగా మారి చేసిన రెండో సినిమా 'సప్తగిరి ఎల్ఎల్‌బి'. లాస్ట్ ఇయర్ సప్తగిరి హీరోగా చేసిన మొదటిసినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్ వసూళ్ల పరంగా శహభాష్ అనిపించుకుని బయ్యర్లకు లాభాలు మిగిల్చింది. ఇక బాలీవుడ్ బ్లాక్ బస్టర్ అయిన 'జాలీ ఎల్ఎల్‌బి' ని రీమేక్ చేస్తూ సప్తగిరి ఇవాళ లాయర్  గా వెండితెరెక్కాడు. ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం..

స్టోరీ: లా చదువుకున్న సప్తగిరి తన గ్రామంలోని వివాదాల్ని ఇట్టే పరిష్కరిస్తుంటాడు. అయితే, కోర్టులో కేసులు మాత్రం గెలవడు. ఇక ఇలా కాదనుకున్న సప్తగిరి సిటీకి వెళ్లి లా వృత్తిలో అనుభవాన్ని, భారీగా డబ్బు సంపాదించి మరదల్ని పెళ్లిచేసుకోవాలని భావించి నగరానికి వెళ్తాడు. ఈక్రమంలో రాజ్ పాల్(సాయి కుమార్) వాధించి, మూయించిన ఓ హిట్ అండ్ రన్ కేసును తిరగదోడతాడు. ఒక సందర్భంలో లంచంకు ఆశపడి 25లక్షలు పుచ్చుకుంటాడు. అయితే, ఊళ్లో వాళ్లు తిట్టిపోయడంతో మళ్లీ యూటర్న్ తీసుకుని కేసును వాధిస్తాడు. కేసువిషయంలో రాజ్ పాల్ తో ఢీ అంటే ఢీ అంటాడు. చివరికి ఈ కేసులో సప్తగిరి విన్ అయ్యాడా? ఈ కేసులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు? చివరికి మరదల్ని పెళ్లి చేసుకున్నాడా అన్నది స్టోరీ.

విశ్లేషణ : బాలీవుడ్ రీమేక్ సప్తగిరి ఎల్ఎల్‌బి లో కథ, కోర్టు సన్నివేశాల్ని పెద్దగా మార్పులు చేర్పులు చేయలేదు. సప్తగిరి బాడీలాంగ్వేజ్ కు తగ్గట్టుగా సన్నివేశాల్ని మార్చాడు డైరెక్టర్. ముఖ్యంగా సాయికుమార్ నటన, కోర్టు సన్నివేశాలు, నిర్మాణ విలువలు సినిమాకు ప్లస్ పాయింట్స్. మైనస్ ల విషయానికొస్తే, ఫస్టాఫ్ లో కొంత లాగింగ్ ఉన్నప్పటికీ సాయికుమార్ ఎంట్రన్స్ తో కథలో వేగం పెరిగింది. సప్తగిరి రెచ్చిపోయినటించగా, శివప్రసాద్ నటనకూడా బావుందనిపిస్తుంది. హీరోయిన్ కాశిష్ వోహ్రా నటించేందుకు పెద్దగా అవకాశంలేకపోయినప్పటికీ తనవరకూ ఓకే అనిపించింది. కథను ఆద్యంతం ఆసక్తిగా మలచడంలో డైరెక్టర్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఆడియన్స్ సహనాన్ని పరీక్షించేలా సన్నివేశాలు సాగుతాయి. సంగీతం, టెక్నికల్ వాల్యూస్ బావున్నాయి. అయితే, సప్తగిరి మీద మరీ హోప్స్ పెట్టుకుని వెళ్తే మాత్రం నిరాశపడాల్సిరావచ్చు. కొన్ని సన్నివేశాలు  ఆడియన్స్ హార్ట్ ను టచ్ చేస్తాయికూడా.

 

Read Also

 
Related News