India / Entertainment
సల్మాన్ ‘రేస్’ మొదలైంది

సల్మాన్ లేటెస్ట్ మూవీ ‘రేస్-3’ మొదలైంది. అందుకు సంబంధించి పిక్‌ని ఈ నటుడు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. రేస్, రేస్ 2 బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడంతో థర్డ్ పార్ట్‌పై కన్నేశాడు ఈ హీరో. గతంలో సైఫ్ అలీ‌ఖాన్‌ చేసిన రోల్‌‌లో స‌ల్మాన్‌ కనిపించనున్నాడు. సల్మాన్‌తో జాక్విలైన్ ఫెర్నాండెజ్ రొమాన్స్ చేయనుంది. కిక్ తర్వాత వీళ్లిద్దరు నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇది.

ఇదిలావుండగా ‘రేస్3’లో మార్పులు భారీగానే వుంటాయని యూనిట్ చెబుతున్నమాట. ఈ చిత్రాన్ని వచ్చేఏడాది ఈద్ సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రానికి కొరియోగ్రాఫ‌ర్‌ రెమో డిసౌజా డైరెక్టర్. ఇక ‘టైగ‌ర్ జిందా హై’ ఆఖరిరోజు షూటింగ్‌ పిక్‌ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు సల్మాన్.

 

Read Also

 
Related News