AP and TS / Entertainment
అనుష్క కాదు.. నాగ్ పక్కన కొత్తమ్మాయి

నాగార్జున- వర్మ కాంబినేషన్‌లో వస్తోంది ఓ మూవీ. షూటింగ్ కూడా మొదలైంది. వర్మ సొంత బ్యానర్‌లో తెరకెక్కి స్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌ రోల్ కోసం అనుష్కని సంప్రదించారని, ఆమెని ఎంపిక చేయడం కూడా జరిగిపోయిందని వార్తలొచ్చాయి. అనుష్క హీరోయిన్ గా ఓకే అయ్యిందంటూ కొన్ని న్యూస్‌పేపర్లు కూడా రాసేశాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ రోల్ పై క్లారిటీ ఇచ్చేశాడు వర్మ. తన మూవీ ద్వారా హీరోయిన్‌గా కొత్త బ్యూటీని తీసుకున్నామని, ఆమె పేరు మైరా సరీన్ అని..  కొన్ని ఫోటోలు పోస్ట్ చేశాడు.

ఇదిలా ఉంటే.. సినిమా ప్రొడక్షన్ దగ్గర హీరో-ప్రొడ్యూసర్ మధ్య 'తేడా'లొచ్చేసినట్లు తెలుస్తోంది. వర్మ సొంత బ్యానర్ మీదే మూవీ మొదలైనప్పటికీ.. 'కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్' విషయంలో వర్మతో నాగ్ విభేదించారని, తాను కోఆపరేట్ చేయలేనంటూ నాగ్ తెగేసి చెప్పేశారని టాక్ నడుస్తోంది. హీరోయిన్ విషయంలో కూడా ఇద్దరి మధ్య 'సంవాదం' జరిగిందట. సీనియర్ హీరోయిన్ కావాలన్నది నాగ్ డిమాండ్. బడ్జెట్ పెరుగుతుందన్నది వర్మ భయం. ఈ క్రమంలో వర్మ మాటే నెగ్గి.. కొత్త హీరోయిన్ పేరు కన్ఫర్మ్ అయ్యింది.

 

Read Also

 
Related News