India / Entertainment
పవిత్ర సంగమం వద్ద మెగా ఈవెంట్

ఒకే వేదికపై కమల్, రజనీ, చిరు! వినడానికే ఆహా అనిపించడం లేదూ! కానీ.. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. వచ్చే సంవత్సరంలో ఏపీలో ఈ కల ఖచ్చితంగా నెరవేరనుంది. మూడు సంవత్సరాలకు కలిపి ఒకేసారి నదుల్ని ప్రకటించిన ఏపీ సర్కార్.. ఇదే బ్యాక్ గ్రౌండ్ మీద మరో గ్రాండ్ స్కెచ్ కూడా వేసుకుంది. 2014, 2016 సంవత్సరాలకు గాను ఎన్టీయార్ నేషనల్ అవార్డులకు తమిళ్ సూపర్ స్టార్స్ కమల్ హాసన్, రజనీకాంత్ ఎంపికయ్యారు.

2016 సంవత్సరానికి రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారం చిరంజీవిని వరించింది. ఈ పురస్కారాల ప్రధానోత్సవాన్ని ఏపీ సర్కార్ వచ్చే ఉగాదికి అమరావతిలో అట్టహాసంగా నిర్వహించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే గనుక జరిగితే.. ఈసారి నందుల వేడుక చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. ఉత్తమ నటుడు బాలకృష్ణ, మహేష్ బాబు, లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి.. ఇంకా ఎందరో మహామహులు ఈ ఈవెంట్ లో పాల్గొనే అవకాశముంది. గతంలో నందుల ప్రదానోత్సవం హైదరాబాద్ లలితకళా తోరణంలో జరిగేది. ఈసారి 50వ నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని జనవరి 25 లేదా 30 తేదీల్లో పవిత్ర సంగమం వద్ద నిర్వహించేలా ప్లానింగ్ జరుగుతోంది.

 

Read Also

 
Related News