AP and TS / Entertainment
‘వీరగ్రంథం’లో రాయ్‌లక్ష్మి! నిమ్మకూరులో షూట్‌కి అడ్డంకులు

‘లక్ష్మీస్ వీరగ్రంథం’ మూవీ గురించి లేటెస్ట్ న్యూస్. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో లక్ష్మీపార్వతి రోల్ కోసం వాణీ విశ్వనాధ్‌ని సంప్రదించినట్లుగా వార్తలొచ్చాయి. ఆ పాత్రలో నటించడానికి రెడీగా వున్నానంటూ ఆమె తెలిపింది. కానీ, లక్ష్మీపార్వతి పాత్ర కోసం దర్శకుడు కేతిరెడ్డి మరో యంగ్ హీరోయిన్‌ని తీసుకోబోతున్నాడనేది తాజా వార్త. ఆమె ఎవరోకాదు.. ‘జూలీ-2’లో నటించిన రాయ్‌లక్ష్మీ. ఈ ప్రాజెక్ట్‌లో నటించడానికి ఆమె దాదాపుగా ఓకే చెప్పిందని ఇన్‌సైడ్ సమాచారం.

ఇదిలావుండగా కృష్ణాజిల్లా నిమ్మకూరులో ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ మూవీ చిత్రీకరణపై గ్రామపెద్దలు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎన్టీఆర్‌ లైఫ్‌లో కొన్ని యదార్థ సంఘటనలను ఆధారంగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించేందుకు యూనిట్‌ అక్కడికి వెళ్లింది. పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలను కలిసి షూటింగ్ చేద్దామని కేతిరెడ్డి టీమ్ భావించింది. దీనికివాళ్లు నిరాకరించారు. ఇందులో ఏవైనా అభ్యంతకరమైన సన్నివేశాలుంటే ఎన్టీఆర్‌కి, ఆయన సొంతూరు నిమ్మకూరుకి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో అభ్యంతరం తెలిపారు. అనంతరం ఎన్టీఆర్‌, బసవతారకంల కాంస్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి వెనుదిరిగింది యూనిట్. మా సినిమాని ఆపే హక్కు ఎవరికీ లేదని, పైగా.. లక్ష్మీపార్వతే అడ్డుకోవడం సరికాదని దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మండిపడుతున్నారు.

 

Read Also

 
Related News