India / Politics
అర్ధరాత్రి హైడ్రామా.. రాజకీయ ఆటలో చిత్తైన విశాల్

నటుడు విశాల్‌కి ఎన్నికల సంఘం షాకిచ్చింది.. ఆర్కేనగర్‌ బైపోల్ ద్వారా రాజకీయ రంగం ప్రవేశం చేయాలన్న ఈ హీరో డ్రీమ్‌కి ఆదిలోనే గండిపడింది. విశాల్‌ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వేలుస్వామి ప్రకటించారు. నామినేషన్‌ పత్రాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం ఈ ప్రకటన చేశారు. నామినేషన్ల పరిశీలన సందర్భంగా మంగళవారం చెన్నైలో హైడ్రామా నడిచింది. సాంకేతిక కారణాలు చూపుతూ తొలుత ఎన్నికల అధికారులు నటుడు విశాల్‌ నామినేషన్‌ను తిరస్కరించారు. ఐతే, ఆయన ఈసీని కలిసి తనను బలపరిచిన వారికి బెదిరింపులు వచ్చాయని చెప్పడంతో రాత్రి 8.30 గంటలకు ఆయన నామినేషన్‌ ఆమోదం పొందినట్లు ప్రకటించారు. 

ఇది జరిగిన కాసేపటికే.. విశాల్‌ ఇచ్చిన వివరణ అవాస్తమని తేలడంతో తిరిగి రాత్రి 11 గంటలకు ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మరోవైపు పత్రాన్ని పూర్తిగా నింపకుండానే సమర్పించడంతో దీప నామినేషన్‌ను తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. ఓవరాల్‌గా ఆర్కేనగర్‌ బైపోల్‌లో మొత్తం 131 మంది నామినేషన్లు వేయగా పరిశీలనలో 54 తిరస్కరణకు గురయ్యాయి. జయ నియోజకవర్గం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టాలన్న విశాల్ మాస్టర్ ప్లాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. 

 

 

Read Also

 
Related News