India / Entertainment
చిక్కుల్లో హీరోయిన్ లావణ్యత్రిపాఠీ!

హీరోయిన్ లావణ్యత్రిపాఠీ గురించి లేటెస్ట్ న్యూస్. ఆమెకి కోలీవుడ్‌ ప్రొడ్యూసర్స్ సంఘం మూడు కోట్ల రూపాయల ఫైన్
విధించినట్లు తమిళ వర్గాలు అంటున్నాయి. తెలుగులో హిట్టయిన 100% లవ్‌ మూవీని తమిళంలో 100% కాదల్‌గా రీమేక్‌
చేస్తున్నారు. షూటింగ్ మొదలై కొద్దిరోజుల తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది లావణ్య త్రిపాఠీ. దాంతో చిత్రీకరణను
నిలిచిపోయింది.

 

కానీ అప్పటికే నిర్మాతలకు రూ.3 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ క్రమంలో నిర్మాతలు.. సంఘాన్ని ఆశ్రయించడం జరిగిపోయింది. మరోవైపు జరిమానా విషయమై లావణ్య నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా అర్జున్‌‌రెడ్డి ఫేం షాలినిపాండేను ఎంపిక చేసిన విషయం తెల్సిందే!

 

Read Also

 
Related News