AP / Politics
అవసరమైతే దెబ్బలు తింటా, జైలుకెళ్తా- పవన్

విశాఖలోని డీసీఐ ఉద్యోగులకు తన నైతిక మద్దతు ప్రకటించిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్, తన బాధ్యతలను మరిచిపోలేదని, తప్పించుకుపోలేదన్నారు. సమస్యల నుంచి పారిపోనని, అవసరమైతే దెబ్బలు తింటా, జైలుకెళ్తానన్నారు. లాభాల బాటలోవున్న డీసీఐని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం సరికాదని, టాప్-10లోవున్న ఈ సంస్థను ప్రైవేటు పరం చేయడంలో ఔచిత్యంవుందా అని ప్రశ్నించారు. నష్టాల సాకు చూపి ఇలా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

ప్రజాసమస్యలను పరిష్కరించలేనప్పుడు నేను మద్దతిచ్చిన పార్టీలను నిలదీసే హక్కు వుందన్నారు. ముఖ్యమంత్రి అయితేనే సమస్యలను పరిష్కరించగలమనే విదానానికి స్వస్తి పలకాలన్నారు. డీసీఐ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరిన ఆయన, భవిష్యత్‌లో జనసేన తప్పు చేసినా నిలదీయాలన్నారు. ఎంపీలు హరిబాబు, అవంతి శ్రీనివాస్ తప్పించుకోవచ్చుగానీ..తాను తప్పించుకోనని, కడుపు మండి మాట్లాడుతున్నానని, ఇంతకన్నా నిజాయితీగా బతకలేనన్నారు పవన్. ప్రజా సమస్య లను పరిష్కరించలేని నేతలకు 2019 ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. డీసీఐకి అన్యాయం జరిగితే బీజేపీకి ఫస్ట్ ఓటమి విశాఖ నుంచి మొదలవుతుందన్నారు.

 

Read Also

 
Related News