India / Entertainment
డాలర్ మార్కెట్‌పై ‘అజ్ఞాతవాసి’ కన్ను

ఓవర్సీస్ మార్కెట్‌పై కన్నేసింది ‘అజ్ఞాతవాసి’ మూవీ. ఈసారి యూఎస్ లో గత పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అయిన థియేటర్ల కంటే ఎక్కువ స్క్రీన్స్ లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు బయ్యర్లు. అందుకు సంబంధించిన థియేటర్ల లిస్ట్‌ కూడా సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. ఇటు జ‌న‌వ‌రి 9న ప్రీమియ‌ర్ షోకి ప్లాన్ చేస్తుండ‌గా, దీనికి సంబంధించి ఎరేంజ్‌మెంట్స్ కూడా జ‌రుగుతున్నాయ‌ట‌. 

నార్మల్‌గా త్రివిక్రమ్ సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి మార్కెట్ వుండడమే దీనికి కారణంగా చెబుతున్నారు. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన చిత్రాలకు అక్కడ డాలర్ల పంట పండింది.  ఓవర్సీస్‌లో ఈ చిత్రం రైట్స్ 21 కోట్లకు వెళ్లినట్టు ఇన్‌సైడ్ సమాచారం. ఇక తెలుగు రాష్ర్టాల్లోనూ 1500 థియేటర్స్‌లో విడుదల చేసేందుకు బయ్యర్లు ప్లాన్ చేస్తున్నప్పటికీ మిగతా సినిమాలు వుండడంతో కాసింత తర్జనభర్జన పడుతున్నారు. పవన్ పక్కన కీర్తి సురేష్‌, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఖుష్బూ కీలకపాత్ర పోషిస్తోంది.

 

Read Also

 
Related News