AP / Politics
సెక్రటేరియట్ కట్టలేనివారు పోలవరం కడతారా?- పవర్ స్టార్

పోలవరం ప్రాజెక్టు 2018లోగా పూర్తయ్యే ఛాన్సే లేదన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. పోలవరం లాంటి ఛాలెంజింగ్ టాస్క్ ని ప్రభుత్వాలు ఒక కామెడీ స్కిట్ లా మార్చేశాయంటూ విరుచుకుపడ్డారాయన. ఎవరికివారు కన్ ఫ్యూజన్ ని పెంచుకుంటూపోవడం వల్ల పోలవరం ప్రాజెక్టు మరింత సంక్లిష్టం అవుతోందన్నారు. జమాఖర్చులతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయడానికి, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి చంద్రబాబు సర్కారుకు ఇబ్బందేమిటో అర్థం కావడం లేదని, ఒక సెక్రెరేటియట్ కట్టడంలో విఫలమైన ప్రభుత్వాలు ఇంత భారీ ప్రాజెక్టుని ఏడాదిలోగా పూర్తి చేయడం అనేది హాస్యాస్పదమేనని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. కేంద్రంతో కొట్లాడతారా అంటే ముందు 'మన బంగారం మంచిదో కాదో తెలుసుకోవాల్సిఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు అంశాన్ని ఎలక్షన్ జిమ్మిక్ గా వాడుకోవాలనుకునేవాళ్లకు 2019 ఎన్నికల్లో డ్యామేజ్ తప్పదని హెచ్చరించారు కూడా. 

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం పోలవరం ప్రాజెక్ట్‌ని సందర్శించాడు. అక్కడి నిర్మాణ పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ స్థితిగతులేంటి? జాప్యానికి కారణాలేంటి? నిధుల మంజూరు ఎక్కడాగిపోయింది? లాంటి డీటేల్స్‌ని అధికారుల నుంచి రాబట్టుకున్నారు. ప్రాజెక్ట్ బ్లూప్రింట్‌ని దగ్గరపెట్టుకునిమరీ పవన్ కల్యాణ్ లోతుగా ప్రాజెక్ట్ స్టేటస్‌ని అవగతం చేసుకున్నారు.  

 

Read Also

 
Related News