India / Crime
క్లైమాక్స్‌లో ‘పద్మావతి’.. సినిమా హాలు ధ్వంసం

‘పద్మావతి’ మూవీ వ్యవహారం క్లైమాక్స్‌కి చేరింది. ఈ చిత్రం విడుదలకు రెడీ కావడంతో కర్ణిసేన తమ ఆందోళనలను మరింత ఉధృతం చేసింది. ‘పద్మావతి’ ట్రైలర్‌ని ప్రదర్శించినందుకు రాజస్థాన్‌.. కోట ప్రాంతంలోని ఆకాష్ సినిమా హాలులో ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. థియేటర్‌లోకి ప్రవేశించి అద్దాలు పగలగొట్టి వీరంగం సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మాల్ విధ్వంసంపై ఆ రాష్ర్ట హోంమంత్రి గులాబ్ చంద్ మాట్లాడుతూ పద్మావతిపై అభ్యంతరాలుంటే ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా నిరసనలు తెలుపుకోవాలిగానీ, ఇలా హింసాత్మక ఘటనలకు పూనుకోవడం సరికాదన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే ఎవరైనా సరే శిక్ష తప్పదని హెచ్చరించారు.

 Karni Sena vandalised Aakash Mall in Kota protesting Padmavati's trailer being shown at the Cinema Hall #Rajasthan (NOTE: Strong language) pic.twitter.com/web5T0ewtC

 

Read Also

 
Related News