AP and TS / Entertainment
సీతారాముల సన్నిధిలో ఎన్టీఆర్ ఫ్యామిలీ

హీరో ఎన్టీఆర్‌ శుక్రవారం భద్రాచలంలోని సీతారాములను దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు దేవస్థానం సిబ్బంది ఆహ్వానం ప‌లికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత స్వామి వారి ప్రసాదాలను అందచేశారు ఆలయసిబ్బంది. ఎన్టీఆర్‌తోపాటు డైరెక్టర్ కొరటాల శివ కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు.

ఇటీవల ఎన్టీఆర్.. రామాయణంలోని పాత్రల ఆధారంగా తీసుకుని నటించిన ‘జై లవకుళ’ ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో రాములవారి సన్నిధికి వెళ్లినట్టు చెబుతున్నారు. ఇటు కొరటాల శివ తన మూవీ హిట్ కాగానే భద్రాచలం వెళ్లడం చూస్తూనే వున్నాం. ఆ మధ్య ‘శ్రీమంతుడు’ హిట్ కాగానే అక్కడికి వెళ్లిన సంగతి తెల్సిందే!

 

Read Also

 
Related News