India / Entertainment
బయోపిక్.. ఇక్కడ బాలకృష్ణ.. అక్కడ కట్టప్ప

బాలీవుడ్‌లోనేకాదు.. సౌత్‌లోనూ బయోపిక్‌ల ట్రెండ్ మొదలైంది. ఇప్పటికే ఎన్టీఆర్ లైఫ్‌పై ఓ మూవీ రెడీ అవుతోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక శరవేగంగా జరుగుతోంది. ఇందులో చంద్రబాబు రోల్‌లో జగపతిబాబు, ఎన్టీఆర్‌ రాజకీయ ప్రయాణంలో చైతన్య రథ సారధిగా కల్యాణ్‌రామ్ కనిపించనున్నాడు. ఇక తమిళనాడులో నటుడిగా జీవితం ప్రారంభించిన సీఎం అయిన ఎంజీఆర్‌‌పై బయోపిక్‌ రానుంది. గతంలో కామరాజ్ బయోపిక్ చేసిన బాలకృష్ణన్‌.. దీని బాధ్యతలు చేపట్ట నున్నాడు. ఎంజీఆర్‌ పాత్రకు సతీష్‌కుమార్‌, సత్యరాజ్‌ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఐతే, కేవలం బుల్లితెర ప్రకటనల ద్వారా మాత్రమే తమిళ ప్రేక్షకులకు పరిచయమైన సతీష్ కంటే సత్యరాజ్ బెటరని అంటున్నారు. దాదాపు ఎంజీఆర్ పోలికలున్న సత్యరాజ్ ఇప్పటికే బాహుబలిలో కట్టప్ప పాత్ర వేసి జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. అందుకే కట్టప్ప వైపు యూనిట్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇటు ‘ఎంజీఆర్‌ వేషంలో సతీష్ కుమార్’ అంటూ సోషల్‌మీడియాలో ఓ ఫోటో హంగామా చేస్తోంది.

గతంలో ఎంజీఆర్ లైఫ్‌పై మణిరత్నం ‘ఇద్దరు’ పేరిట మూవీని తెరకెక్కించాడు. అందులో ఎంజీఆర్‌గా మోహన్‌లాల్, కరుణానిధిగా ప్రకాష్‌రాజ్ నటించిన సంగతి తెల్సిందే! ఇక కొత్త ప్రాజెక్ట్ విషయానికొస్తే.. రమణ కమ్యూనికేషన్స్‌ సంస్థ నిర్మించనున్న ఎంజీఆర్ బయోపిక్ నవంబర్‌ 8న ప్రారంభంకానుంది. ఎంజీఆర్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎలా రాణించారన్నదే మెయిన్ థీమ్‌. మరోవైపు సినిమా, రాజకీయాల్లో రాణించిన ఎన్టీఆర్, ఎంజీఆర్‌ బయోపిక్‌లు ఏకకాలంలో తెరకెక్కడం తెలుగు, తమిళ రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌‌గా మారింది.

 

Read Also

 
Related News