India / Politics
రాహుల్ గాంధీకి పోటీగా నామినేషన్ వేశా.. కానీ..

కాంగ్రెస్ పార్టీకి మరో కొత్త ఇరకాటం. ఏఐసీసీ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీకి కట్టబెడదామని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పెద్దలు.. ఇందుకోసం భారీ కసరత్తే చేయాల్సి వస్తోంది. పోటీ నామినేషన్లు పడకుండా అంతర్గతంగా 'బెదిరింపులకు' దిగినట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఇప్పుడు తాజాగా యూపీకి చెందిన అయూబ్ అలీ అనే ఒక ముస్లిం కాంగ్రెస్ నేత అధిష్టానం మీదకు డైరెక్ట్ ఎటాక్ మొదలుపెట్టేశారు. అధ్యక్ష పదవికి తాను కూడా నామినేషన్ వేశానని, కానీ సరైన కారణం చూపకుండా తిరస్కరించేశారని చెబుతున్నాడు. ఒకవేళ.. ఈ అయూబ్ అలీ నామినేషన్ ఓకె అయ్యుంటే రాహుల్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ ఉండేది కాదు. ఎన్నికలు అనివార్యమయ్యేవి.. పార్టీ ప్రతిష్ట భంగపడేది. ఇప్పటికే.. రాహుల్ కి అనుకూలంగా ఏఐసీసీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలొచ్చేశాయి. పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారి తన మీద బెదిరింపులకు పాల్పడ్డారని షెహజాద్ పూనవల్లా అనే వ్యక్తి మీడియాకెక్కేశారు. కాంగ్రెస్ పార్టీ మొఘల్ సామ్రాజ్యం లాంటిదని, అక్కడ వారసులకి మాత్రమే కిరీటం దక్కుతుందని, అదే క్రమంలో ఇప్పుడు 'ఔరంగజేబు'కి పట్టం కడుతున్నారని ప్రధాని మోడీ కూడా సెటైర్ వేశారు. ఇప్పుడు అయూబ్ అలీ 'నామినేషన్' గొడవ.. మోదీ చెప్పిన భాష్యానికి అద్దం పడుతున్నట్లే వుంది. ఈ మొత్తం ఎపిసోడ్ ని గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునే ఆలోచనలో వుంది. 

 

Read Also

 
Related News