AP / crime
రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యే కొడుకు.. పారిశ్రామికవేత్తకు బెదిరింపులు

ఏపీలో ఓ వైసీపీ ఎమ్మెల్యే కొడుకు రెచ్చిపోయాడు. తన అనుచరులతో కలిసి ఓ పారిశ్రామికవేత్త ఫ్యామిలీపై దాడికి సిద్ధపడ్డాడు. ఆయన ఇంట్లోకి వెళ్లి బీభత్సం సృష్టించాడు. అసలేం జరిగిందంటే.. కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కొడుకు చంద్రమౌళికి, వెల్దుర్తికి చెందిన బిజినెస్‌మేన్ రమేష్‌శెట్టికి మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఆయనకు రమేష్ కొంత డబ్బుఇవ్వాల్సివుంది.

చివరకు రమేష్ అందుబాటులో లేకపోవడంతో శుక్రవారం ఉదయం రెండువాహనాల్లో అనుచరులతో కలిసి వెల్దుర్తి వెళ్లాడు ఎమ్మెల్యే కొడుకు. రమేష్‌శెట్టి ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసేసి అనుచరులతో దాడికి ప్రయత్నించారు. బీభత్సాన్ని చూసి ఇంట్లోవున్న రమేష్ భార్య, పనిమనిషి భయంతో వణికిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని చంద్రమౌళితోపాటు అనుచరులను పోలీసుస్టేషన్‌కు తరలించారు. మూడురోజులుగా ఫోన్లు చేస్తూ చంపుతానని బెదిరిస్తున్నాడని బాధితుడు రమేష్ ఆరోపించాడు. చివరకు చంద్రమౌళిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Read Also

 
Related News