India / Entertainment
నమితకు పెళ్ళయిపోతోంది!

కోలీవుడ్ బొద్దుగుమ్మ నమిత.. ఓ ఇంటిదవుతోంది. ఎన్నో ఏళ్లుగా తమిళ్, తెలుగు, మలయాళ యూత్ ని తన హొయలతో పిచ్చెక్కించిన నమిత.. పెళ్లి చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేసేసింది. వీరా అనే ఒక చిరకాల స్నేహితుడితో ఈనెల 24న పెళ్ళికి ముహూర్తం కుదిరినట్లు నమిత ఒక పార్టీ వీడియో ద్వారా 'అభిమానులకు' చెప్పేసింది.

 

హీరోయిన్ గా, ఐటెం గాళ్ గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న నమిత.. ఇటీవల తమిళ్ 'బిగ్ బాస్' రియాలిటీ షో పార్టిసిపెంట్ గా కూడా జనానికి మరింత దగ్గరైంది. మొన్నీమధ్యే.. సీనియర్ నటుడు శరత్ బాబుతో నమితకు పెళ్లవుతోందంటూ వార్తలొచ్చినా.. అవన్నీ బూటకమని తేలిపోయింది.

 

Read Also

 
Related News