AP and TS / Entertainment
నంది అవార్డ్ మాకవసరం లేదన్న నాగ్

నంది అవార్డుల వివాదంపై ఎట్టకేలకు నోరు విప్పాడు టాలీవుడ్ హీరో నాగార్జున. ‘మనం’కి నంది అవార్డ్ రాకపోవడంపై ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు తనదైనశైలిలో రిప్లై ఇచ్చేశాడు ఆయన. ఈ సినిమాకి ప్రేక్షకులు త‌మ గుండెలిచ్చారని, వాళ్ల ఆద‌ర‌ణ మాకు ఆస్కార్ క‌న్నా ఎక్కువేనన్నాడు. దీంతో నంది అవార్డుల ప్రక‌ట‌న‌పై నాగ్ కాసింత అస‌హ‌నంగానే వున్నట్లు ఇన్‌‌డైరెక్ట్‌‌గా చెప్పకనే చెప్పాడు.

హ‌లో’ మూవీ ప్రమోష‌న్స్‌లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవ‌ల 2014, 2015, 2016 సంవ‌త్సరాలకు నంది అవార్డులు ప్రక‌టించిన సంగతి తెలిసిందే! ఈ స్టేట్‌మెంట్ త‌ర్వాత పెద్ద దుమార‌మే రేగింది. కొంతమంది ద‌ర్శకులు, నిర్మాత‌లు జ్యూరీపై మండిప‌డ్డారు. ఏఎన్ఆర్ న‌టించిన ఆఖ‌రు మూవీ ‘మ‌నం’కి నంది అవార్డు రాక‌పోవ‌డంపై యూనిట్‌ సభ్యులు అసహనం వ్యక్తంచేశారు.

 

Read Also

 
Related News