AP and TS / Entertainment
అఖిల్ సత్తా తెలిసిందా?
అఖిల్ విషయంలో ఈసారి నాగార్జున చాలా ప్లాన్డ్ గా వున్నాడు. అఖిల్ డెబ్యూ మూవీ దగ్గర ఒకసారి బాగా దెబ్బతిన్న అక్కినేని ఫ్యామిలీ.. ఇకముందు అలా కాకూడదన్న పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద గ్యాప్ తీసుకున్నప్పటికీ.. ఒక నాణ్యమైన సినిమాతో అఖిల్ ని మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేయాలన్న నాగ్ ఐడియా కొద్దికొద్దిగా వర్కవుట్ అవుతోంది కూడా. ఫ్యామిలీకి ల్యాండ్ మార్క్ మూవీనిచ్చిన సెంటిమెంటల్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ ని 'హలో'కి  ఫిక్స్ చేయడం మొదటి ఎత్తుగడయితే.. ఆ సినిమా కంటెంట్ విషయంలో కూడా దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు నాగార్జున. అవుట్ ఫుట్ మీద మంచి నమ్మకం వచ్చిందంటూ యూనిట్ కూడా నాగ్ తో చెప్పినట్లు సమాచారం. ఇక మిగిలింది.. పబ్లిసిటీ ఎపిసోడ్. 
 
హలో మూవీలో వుండే కమర్షియల్ వ్యాల్యూస్ ఏమిటన్న లెక్కలేసుకుని, వాటిని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో కూర్చుని మాట్లాడుకుని ముందుకెళ్తోంది అక్కినేని ఫ్యామిలీ. టీజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కొంచెం గడబిడ జరిగినట్లు వార్తలొచ్చినప్పటికీ.. అది కూడా తాత్కాలికమేనంటూ తెలివిగా సర్దేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఒక సాంగ్ బిట్ బైటికొచ్చింది. దీని విడుదల కూడా అత్యంత నాటకీయంగా జరిగింది. 'వెయిట్ ఫర్ ఏ సర్ ప్రైజ్' అంటూ అఖిల్ ట్వీట్ చేస్తే.. 'నాకంత ఓపిక లేదు.. ఆ సర్ ప్రైజ్ ఇదేగా..' అంటూ సాంగ్ బిట్ తో రీట్వీట్ చేశాడు నాగార్జున. తండ్రీకొడుకులిద్దరూ కూడబలుక్కుని మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడ్డారన్న విషయం నెటిజన్లకు స్పష్టంగా అర్థమైనప్పటికీ.. అందరూ నవ్వి ఊరుకున్నారు.
 
'లీక్' అయిన ఆ పాట వీడియోలో.. అఖిల్ డాన్సింగ్ పెర్ఫార్మెన్స్ ఒక్కటే  హైలైట్! అఖిల్ ఎంత బాగా డాన్స్ చేస్తాడో చూడండి.. అంటూ నాగ్ టాలీవుడ్ కి ఓ సున్నితమైన ఛాలెంజ్ విసిరినట్లుంది. ఇందులో నిజం లేకపోలేదంటూ అక్కినేని ఫ్యాన్స్ లోనే గుసగుసలు! తాత, నాన్న, అన్నలతో పోలిస్తే డాన్స్ విషయంలో అఖిల్ పదిరెట్లు బెటరంటూ కాంప్లిమెంట్లు పడిపోతున్నాయి. మొత్తమ్మీద అఖిల్ 'హలో' మూవీ సైలెంట్ గానే బోలెడు ప్రమోషన్ మూటగట్టుకుంటోంది. 

 

Read Also

 
Related News