AP and TS / Entertainment
నిన్న అనుష్క... నేడు నాగచైతన్య..

నాగచైతన్య- డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో ఓ ఫిల్మ్ రానుంది. దాదాపుగా పనులు పూర్తికావడంతో నటీనటుల ఎంపిక జరుగుతోంది. దీని తర్వాత రేపోమాపో సెట్స్‌కి వెళ్లాలన్నది మేకర్స్ థాట్. ఇక సినిమాకి ‘శైలజారెడ్డి అల్లుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు టాక్. శైలజారెడ్డి అల్లుడుగా నాగచైతన్య కనిపిస్తున్నాడట. ఇక శైలజారెడ్డి రోల్‌లో రమ్యకృష్ణ.

 

నిన్నటికినిన్న బాహుబలిలో అనుష్కకు అత్తగా కనిపించిన ఆమె.. ఇప్పుడు చైతూకి అన్నమాట. ఇక అత్తా- అల్లుడు తరహాలో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. అవన్నీ బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

 

Read Also

 
Related News