AP and TS / Entertainment
ఎన్టీఆర్‌ బయోపిక్: ఇందిర ఇన్ .. లక్ష్మి ఔట్

బాలకృష్ణ తెరకెక్కించనున్న ఎన్టీఆర్ బయోపిక్‌పై క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్ మూవీతో ఎలాంటి వివాదాలకు చోటు ఇవ్వ
కూడదన్న బాలయ్య ఆలోచనకు తగ్గట్టుగానే స్ర్కిప్ట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. నందమూరి జీవితంలో లక్ష్మిపార్వతి
ఎంట్రీతోనే వివాదాలు మొదలయాయన్న వెర్షన్‌తో డైరెక్టర్ తేజ ఏకీభవించారని, అందుకే తన సినిమాలో లక్ష్మిపార్వతి
పాత్రను ఎలిమినేట్ చేశారని ఇన్‌సైడ్ సమాచారం.

ఎన్టీఆర్ జీవితంలోని చరమాంకాన్ని నామినల్‌గా చూపిస్తూ సినిమాని ముగించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే తేజ తయారు చేస్తున్న స్ర్కిప్ట్‌లోని కొన్ని కీ సీన్స్ బయటకు పొక్కాయి. మూవీ ఓపెనింగ్ షాట్‌కు సంబంధించిన వివరాల్ని ఓ న్యూస్‌పేపర్ బయటపెట్టింది. ఇందిరాగాంధీ- పీవీ నరసింహారావుతో కలిసి కారులో తిరుపతికి వస్తుండగా జరిగిన సంభాషణతో మూవీ మొదలవుతుందట. రోడ్డుకి ఇరువైపులా కనిపిస్తున్న భారీ సైజు కృష్ణుడు, రాముడి కటౌట్లను చూసి ఇందిరాగాంధీ ఆరా తీయగా అవి దేవుళ్లవి కావు.. ఓ సినిమా నటుడివి అంటూ క్లారిటీ ఇచ్చారు పీవీ. దీంతో అవాక్కైన ఇందిర.. ఎన్టీఆర్ గురించి డీటేల్స్ అడిగి ఆసక్తిగా విన్నప్పటి సందర్భాన్ని తేజ తన సినిమాలో ఓపెనింగ్ షాట్‌గా వాడుకుంటున్నట్లు రాసుకొచ్చింది.

 

Read Also

 
Related News