India / Politics
'డ్రగ్స్' వివాదంలో అమిత్ షా!
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. ఒక వింత వివాదంలో చిక్కుకున్నారు. మధ్యప్రదేశ్ నార్కోటిక్స్ విభాగం పోలీసులు ఇటీవల ఒక క్యాలెండర్ అచ్చేసుకున్నారు. మాదకద్రవ్యానికి బానిసలు కావొద్దంటూ ఆ క్యాలెండర్ పేజీల్లో కొన్ని అవేర్నెస్ కొటేషన్స్ కూడా ముద్రించుకున్నారు. ఇంతవరకూ బాగానే వుంది. సదరు కొటేషన్స్ చెప్పినవారు ఫలానా అంటూ.. వాటి పక్కనే అమిత్ షా, మోహన్ భగవత్ ఫోటోలు ప్రింటయి ఉండడమే వివాదానికి దారితీసింది. బీజేపీ ప్రభుత్వం పట్ల సానుకూలత ప్రదర్శించుకోడానికి కొంతమంది వీరవిధేయులు ఈ చర్యకు పాల్పడి వుండొచ్చన్నది ప్రాధమిక సమాచారం. కానీ.. పోలీస్ డిపార్ట్ మెంట్ పాల్పడ్డ ఈ అత్యుత్సాహం మీద అక్కడి కాంగ్రెస్ పార్టీ గుర్రుగా వుంది. క్యాలెండర్లు వెంటనే మార్చాలంటూ పట్టుపడుతోంది. 
 

Read Also

 
Related News