India / General
కారు ఉందా? మోదీ గిఫ్ట్ మీకే.!

నరేంద్రమోదీ సర్కారు మరో గిఫ్ట్ రెడీ చేస్తోంది. అయితే, ఇది సొంత కారున్న వాళ్లకి మాత్రమే.. ఈ వర్గానికి వంట గ్యాస్ సబ్సిడీని పీకేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఎల్‌పీజీ వంటగ్యాస్ సిలిండర్లపై ఇస్తోన్న సబ్సిడీని దశల వారీగా ఎత్తేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని జిల్లాలో ఆర్టీఓ కార్యాలయాల నుంచి కారు యజమానుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రస్తుతం చాలామందికి రెండు లేదా మూడు కార్లు ఉన్నప్పటికీ గ్యాస్‌ సబ్సిడీ  పొందేవాళ్లున్నట్టుగా కేంద్రం భావిస్తోంది. డైరెక్ట్ గా అకౌంట్లలోకే నగదు బదిలీ విధానాన్ని అవలంభించడం ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా 3.6 కోట్ల నకిలీ గ్యాస్‌ కనెక్షన్లను తీసేశారు.

 

Read Also

 
Related News