AP and TS / Entertainment
సీఎం ఆఫీస్‌కి మహేష్‌బాబు

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు లేటెస్ట్ మూవీ ‘భరత్ అనే నేను’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఐతే, ఈ చిత్రం ఇన్‌సైడ్ ఫోటోలు బయటకు రాకుండా యూనిట్ ఎంత ప్లాన్ చేసినా ఏదోవిధంగా వచ్చేస్తున్నాయి. అసెంబ్లీలో చర్చ, అధికారులతో ప్రిన్స్ వంటి ఫోటోలు ఇటీవల బయటకు వచ్చాయి.

తాజాగా మహేష్‌బాబు సీఎం క్యాంప్ ఆఫీసుకి వచ్చినట్లు చూపే ఓ పిక్ సోషల్‌మీడియాలో హంగామా చేస్తోంది. ఇందులో ముఖ్యమంత్రిగా మహేష్‌బాబు కనిపించనున్నాడు. అందుకు తగ్గట్టుగానే ప్రిన్స్ వెనుక పీఏ బ్రహ్మాజీ, వెనుక కాన్వాయ్.. సెక్యూరిటీగా బ్లాక్ కమెండోలు ఇవన్నీ కనిపించడంతో మూవీపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

 

నార్మల్‌గా సెట్లో ఫోటోలు లీకైతే కాసింత డల్‌గా వుంటాయి. కానీ భరత్ మూవీ లీక్డ్ ఫోటోలు క్లారిటీతో వుండడంతో 'అనుమానాలు' వ్యక్తమవుతున్నాయి. యూనిట్ ఉద్దేశపూర్వకంగానే ఈ ఫోటోలను లీక్ చేస్తోందనే ప్రచారం మొదలైంది.

 

Read Also

 
Related News