India / Entertainment
వీడియో లీక్, సీనియర్ హీరోతో ఇల్లీ

గోవా బ్యూటీ ఇలియానా మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఓ వైపు బాయ్‌ఫ్రెండ్‌తో పబ్లిక్‌గా కనిపిస్తూనే.. మరోవైపు సీనియర్ హీరో‌తో చక్కర్లు కొడుతోంది. లక్నోలో ఆ హీరోతో కలిసి జీపులో నుంచి ఇలా బయటకువచ్చింది. ఆ తతంగాన్ని అక్కడున్న ఓ  అభిమాని తన సెల్‌తో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వదిలాడు. అసలు స్టోరీ ఏంటంటే..

 

ఇదంతా ఇలియానా నటిస్తున్న బాలీవుడ్‌లో ‘రైడ్’ మూవీలోని ఓ సన్నివేశం. అజయ్ దేవ్‌గన్ హీరోగా రానున్న ఈ చిత్రం షూటింగ్ లక్నో పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇందులో ఆదాయపు పన్ను శాఖ అధికారిగా అజయ్.. అతడి వైఫ్‌గా ఇల్లీ కనిపిస్తోంది. సందర్భం.. ఏదో పని నిమిత్తం ఆఫీసుకు నటీనటులు జీపులో వచ్చిన సన్నివేశాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ రాజ్‌కుమార్ గుప్తా. దాదాపు షూటింగ్ క్లైమాక్స్ చేరుకుంది. అన్నీఅనుకున్నట్లుగా జరిగితే వచ్చే మార్చి 16న దేశవ్యాప్తంగా రిలీజ్ చేయాలన్నది మేకర్స్ థాట్.

 

#Raid shooting 😎

A post shared by Âkhàńd Pŕàtãp (@pratap_akhand420) on

 

Read Also

 
Related News