India / Politics
ఇంతకీ.. కమల్ పార్టీపై మమత ఏమన్నట్లు?

విలక్షణ నటుడు కమల్‌‌హాసన్‌ పెట్టబోయే పొలిటికల్ పార్టీ గురించి బెంగాల్ సీఎం మమత‌బెనర్జీ ఏమన్నారు? పార్టీ
ప్రకటించమని కమల్‌కి చెప్పారా? లేక అసెంబ్లీ ఎన్నికల వరకు వెయిట్ చేయమన్నారా? రాబోయేరోజుల్లో కమల్ ఎలాంటి వ్యూహాలను అవలంభించనున్నారు? ఇవే ప్రశ్నలు చాలామంది రాజకీయ నేతలను వెంటాడుతున్నాయి.

 

అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి శుక్రవారం కోల్‌కతా వెళ్లిన కమల్‌హాసన్.. ఈ సందర్భంగా ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో సెపరేట్‌గా భేటీ అయ్యారు. వీళ్లిద్దరి మధ్య పావుగంటకు పైగానే జరిగిన సమావేశంలో రాజకీయాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడినట్టు వార్తలు వెలువడుతున్నాయి. మరి.. మమతా ఎలాంటి డైరెక్షన్ ఇచ్చారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిటింగ్ తప్పదని అంటున్నారు. ఆ మధ్య కమల్ కేరళ సీఎంని కలిశారు. ఆ తర్వాత ఈ నటుడితో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెన్నైలో సమావేశమయ్యారు. ఇప్పుడు మమతాబెనర్జీతో! ఇలా జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలతో కమల్ భేటీకావడం సహజంగానే పొలిటికల్ పార్టీల్లో చర్చకు తావిచ్చింది.

 

Read Also

 
Related News