AP and TS / Entertainment
మాస్ మహారాజా పక్కన కాజల్!

రవితేజ- శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వస్తున్న కొత్త ప్రాజెక్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఐతే,  మాస్ మహారాజా పక్కన హీరోయిన్ గా కాజల్ నటిస్తోందని టాక్. ఈ మధ్యనే కాజల్‌ని డైరెక్టర్ అప్రోచ్ కావడం, ఆమె దానికి సానుకూలంగా స్పందించడం కూడా జరిగిపోయిందని ఫిల్మ్‌నగర్ సమాచారం. గతంలో శ్రీను డైరెక్ట్ చేసిన ‘బాద్ షా’ మూవీలో కాజల్ నటించిన విషయం తెల్సిందే!

ఇక ‘రాజా దిగ్రేట్’ హిట్ కావడంతో ఫుల్‌జోష్‌లో వున్నాడు రవితేజ. గతంలో వీళ్లిద్దరి కాంబోలో నీకోసం, వెంకీ, దుబాయ్
శీను వంటి సినిమాలొచ్చాయి. అవన్నీ బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టాయి. శ్రీను స్టార్ డైరెక్టర్‌గా మారాక రవితేజతో మూవీ
చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ హీరో కోసం శ్రీను డిఫరెంట్ స్టోరీని రెడీ చేయడం, ఆయన ఓకే చెప్పేయడం కూడా
జరిగిపోయింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.

 

Read Also

 
Related News