AP and TS / Politics
కేవీపీ మీద కక్ష కట్టిన సూరీడు !

కేవీపీ మీద సూరీడుకి కోపం  వచ్చింది. అక్రమాస్తుల కేసులో ఓ వైపు జ‌గ‌న్ విచార‌ణ ఎదుర్కొంటున్న సంద‌ర్భంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆత్మగా చెప్పుకున్న కేవీపీ రామ‌చంద్రరావు మాత్రం ఈ కేసుతో సంబంధం లేకుండా త‌ప్పించుకున్న వ్యవ‌హారం మీద 'సూరీడుకి కోపం వ‌చ్చింది'..! గ‌తంలో ఈ కేసుల‌కు సంబంధించి సీబీఐ విచార‌ణ‌కు కేవీపీ హాజ‌ర‌య్యారే త‌ప్ప, ఎలాంటి అభియోగాలు ఎదుర్కోవ‌డం లేదు. అయితే వైఎస్‌కు కుడిభుజంగా, అత్యంత స‌న్నిహితుడిగా వున్న సూరీడు ఈ వ్యవ‌హారంలో మ‌రోసారి సీబీఐని ఆశ్రయించాల‌నుకుంటున్నట్టు తెలుస్తోంది. అవ‌స‌ర‌మైతే ఈ కేసుల మీద రివ్యూ పిటిష‌న్ వేయాల‌ని కూడా సూరీడు ఆలోచిస్తున్నట్టు స‌మాచారం.

 

వేల కోట్ల రూపాయ‌ల లావాదేవీల‌కు సంబంధించిన ఈ త‌తంగం అంతా కేవీపీ పాత్ర లేకుండా జ‌రిగే ఆస్కార‌మే లేద‌ని,
ఆయ‌న్ని కూడా ఈ కేసుల్లో దోషిగా చేర్చిన‌ప్పుడే పూర్తి విచార‌ణ జ‌రిగిన‌ట్టు అవుతుంది అన్నది సూరీడు వాద‌న‌. రివ్యూ పిటిష‌న్ ఎలా ఉండాలి? ఎలా వేయాలి? అన్న అంశం మీద ఇప్పటికే న్యాయ నిపుణుల స‌ల‌హాలు కూడా సూరీడు తీసుకుంటున్నాడన్నది ఆయన స‌న్నిహితుల నుంచి అందుతున్న స‌మాచారం.

 

Read Also

 
Related News