AP / general news
జగన్ సెంచరీ, పాదయాత్రలో సెలబ్రేషన్స్

వైసీపీ అధ్యక్షుడు జగన్ సెంచరీ కొట్టారు! తాను చేపట్టిన 'ప్రజాసంకల్ప యాత్ర'లో ఇప్పటివరకూ 100 కిలో మీటర్లు నడిచి.. ఒక మైలురాయిని అధిగమించేశారు. నిన్ననే సొంత జిల్లా కడపను వీడి.. కర్నూలు జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చిన జగన్.. చాగలమర్రి దగ్గర పాదయాత్ర 100 కిలో మీటర్ల ల్యాండ్ మార్క్ ను దాటేశారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు, గ్రామస్తులు చాగలమర్రి వద్ద పూల వర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు. గొడిగనూరు విలేజ్ లో పార్టీ జెండా ఆవిష్కరించి 'సెంచరీ'ని సెలబ్రేట్ చేసుకుంది వైసీపీ క్యాడర్. 13 జిల్లాల్లో మొత్తం మూడువేల కిలో మీటర్లు నడవాల్సిన జగన్.. మరో ఆరునెలల పాటు పాదయాత్రలోనే ఉండాల్సి వుంది. 

 

Read Also

 
Related News