AP and TS / Entertainment
ఉత్తమ హీరో మహేష్, ఉత్తమ విలన్ ?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఖాతాలో మరో బంగారు నంది ! శ్రీమంతుడు మూవీలో తను చేసిన నటనకు మెచ్చి జ్యురీ ఈ అవార్డు ప్రకటించింది. కానీ.. ఈ క్రెడిట్ వెనుక పెద్ద కహానీ ఉందంటోంది ఫిలిం నగర్. 2015 సంవత్సరానికి గాను మహేష్ బాబును బెస్ట్ లీడింగ్ యాక్టర్ గా అనౌన్స్ చేయడానికి ముందు జరిగిన 'గడబిడ' గురించి పెద్ద చర్చే జరిగిపోతోంది !

 

2014, 2016 నందుల జాబితాలు సిద్ధమైనప్పటికీ.. 2015 విషయంలోనే పీటముడి పడిందట. బాహుబలి సినిమా బెస్ట్ ఫీచర్ ఫిలింగా ఫిక్స్ అయ్యింది. మరి.. అందులో లీడ్ రోల్ చేసిన ప్రభాస్ పెర్ఫామెన్స్ సంగతేంటి? జ్యురీ మెంబర్లలో అయితే ఎటువంటి డౌట్లూ లేవు. కానీ.. అదే సంవత్సరం మెయిన్ కాంపిటీటర్ గా వున్న 'శ్రీమంతుడు' మహేష్ బాబుకు కూడా న్యాయం జరగాల్సిందే! అందుకే.. ఈ పంచాయతీ అమరావతికి చేరిందని, చివరకు మహేష్ బాబు పేరును 'బెస్ట్ లీడింగ్ యాక్టర్'గా ఖరారు చేశారని చెబుతున్నారు. మహేష్ సెలక్షన్ కీ, ప్రభాస్ రిజెక్షన్ కీ అసలైన కారణాలేమిటన్న సందేహం మాత్రం టాలీవుడ్ లో నిన్నటినుంచీ నలుగుతూనే వుంది. బాహుబలి మూవీతో నేషనల్ వైడ్ సెలబ్రిటీగా మారి, అనూహ్యరీతిలో ఫాలోయింగ్ ఏర్పర్చుకున్న ప్రభాస్ ని టాలీవుడ్ మాత్రం  విస్మరించడం ఖచ్చితంగా ప్రశ్నించదగ్గదే! జ్యురీలో కీలకంగా వున్న జీవితా రాజశేఖర్ మహేష్ వైపు మొగ్గు చూపడం వల్లే.. చివరికలా ఖరారైందని తెలుస్తోంది. ప్రభాస్ కు ఉత్తమనటుడు అవార్డు ఇవ్వలేకపోవడంతో.. కృష్ణంరాజుకు రఘుపతి వెంకయ్య పురస్కారం ప్రకటించి ఆవిధంగా సంతృపరిచినట్లు చెబుతున్నారు. ఏదైతేనేం.. నంది అవార్డుల ప్రకటన.. ఇద్దరు పెద్ద హీరోల మధ్య నిప్పు రాజేసినట్లే!

 

 

 

Read Also

 
Related News