India / General
విశాఖలో ఇండిగో ఫ్లైట్‌ని ఢీకొట్టిన అడవిపంది

విశాఖ ఎయిర్‌పోర్టులో పెద్ద ప్రమాదం తప్పింది. రాత్రి పదిన్నర గంటలకు విశాఖ నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానం
ఒకటి బయలుదేరింది. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో రన్‌వేపైకి దూసుకొచ్చిన అడవి పంది టైరుని ఢీకొట్టింది. అప్పటికి విమానం టైర్లు లోపలికి ముడుచుకోకపోవడంతో అప్రమత్తమైన పైలట్, గంటపాటు అక్కడే ఆకాశంలో చక్కర్లు కొట్టించి తిరిగి అదే ఎయిర్‌పోర్టులో విమానాన్ని ల్యాండ్ చేశాడు.

పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి ప్రమాదం లేదని నిర్ధారించాక హైదరాబాద్ బయలుదేరింది విమానం. గంటపాటు ఆకాశంలో చక్కర్లు కొట్టిన విమానం, తిరిగి విమానాశ్రయంలోనే ల్యాండ్ కావడంతో ఏంజరిగిందో తెలియక ప్రయాణికులు భయపడ్డారు. చివరకు విషయం తెలిసి పెను ప్రమాదం తప్పినందుకు ఊపిరి పీల్చుకున్నారు. రన్‌వేపైకి అడవి పంది ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు.

 

Read Also

 
Related News