AP / crime
ఈ పాపం నాది కాదు- నిందితుడు కొండలరావు

బోటు ఘటన పాపం మాది కాదని, అక్కడ మేట వేసిన ఇసుకదేనని ప్రధాన నిందితుడు కొండలరావు చెబుతున్నారు. కృష్ణానదిలో పవిత్ర సంగమం వద్ద జరిగిన పడవ ప్రమాదం తర్వాత ‘రివర్ బోటింగ్’ సంస్థలో పెట్టుబడులు పెట్టిన భాగస్వాములు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసులో ఏ1 నిందితుడు, ‘రివర్ బోటింగ్’ సంస్థ యజమాని కొండలరావు ‘టీవీ9’తో మాట్లాడాడు. ఇందులో తాను భాగస్వామికాదని, ఇప్పటికే ఆర్థికంగా తాను చితికిపోయానని చెప్పాడు. బోట్ల బిజినెస్‌లో శేషగిరి, మనోజ్, గేదెల శ్రీనివాస్, సారధి భాగస్వాములని, వాళ్లు తనకు క్లోజ్‌ఫ్రెండ్స్ అని, తాను లోకల్‌ కనుకే బోట్ కంపెనీకి తన పేరు పెట్టారని, ఇందులో తాను ఒక్కపైసా పెట్టుబడి పెట్టలేదని చెప్పుకొచ్చాడు.

 

పైగా.. ఈ బిజినెస్‌లో తనకు ఎలాంటి అనుభవం లేదన్నాడు కొండలరావు. అప్పుడప్పుడు నాలెడ్జ్ కోసమే వెళ్లి చూసేవాడినని అన్నాడు. ఇప్పటికి 50 లక్షలతో  నాలుగు బోట్లు కొనుగోలు చేశారని, ఇప్పుడు మునిగింది ఐదోదని.. దీన్ని కాకినాడ నుంచి తెచ్చారని వెల్లడించాడు కొండలరావు. అన్నిబోట్లకు అనుమతులున్నాయని, కానీ, నవంబర్ మూడుతో ఆ గడువు ముగిసిందని, రెన్యువల్ కోసం మళ్లీ దరఖాస్తు చేశారని కొండల్ రావు చెబుతున్నాడు.

 

Read Also

 
Related News