Telangana / Politics
రేవంత్ ఫిర్యాదు.. ఏసీబీకి నోటీసులు..

రేవంత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు.. ‘గులాబీ కూలీ’ వ్యవహారంపై పూర్తి నివేదికను డిసెంబర్ 13లోగా ఇవ్వాలని ఏసీబీని ఆదేశించింది హైదరాబాద్ హైకోర్టు. టీఆర్ఎస్ పార్టీలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ సంస్థలు, పరిశ్రమల నుంచి ‘గులాబీ కూలీ’ పేరుతో లక్షల్లో మనీ వసూలు చేశారని ఆరోపించిన రేవంత్‌రెడ్డి, దీనిపై ఆగస్టు 31న ఏసీబీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై ఇంతవరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇదే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఆయన.

 

రేవంత్ తరపున హైకోర్టులో సీవీ మోహన్ రెడ్డి తన వాదనలు వినిపించారు. రేవంత్ ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని, దీనిపై నివేదికను డిసెంబర్ 13లోగా ఇవ్వాలని తెలంగాణ ఏసీబీని తెలుగు రాష్ట్రాల హైకోర్టు ఆదేశించింది. ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసు నడిచే అవకాశాలున్నాయి. ప్రజా జీవితంలోవుండి రాజ్యంగబద్ధమైన హోదాలో, పదవుల్లో ఉండేవారు చిన్నచిన్న పనులు చేసి లక్షలు సంపాదించడం అవినీతి అవుతుందన్న వాదనను రేవంత్ బలంగా ముందుకు తెస్తున్నారు.

 

Read Also

 
Related News