AP and TS / Entertainment
కల్యాణ్‌రామ్ కొత్త పార్టీ

హీరో కల్యాణ్‌రామ్ కొత్త పార్టీ పెట్టాడు.. దాని గుర్తు ట్యాప్. 2019 ఎన్నికల్లో ఈ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను
కోరుతున్నాడు. ఇదేమీ రియల్ లైఫ్ కాదండోయ్.. రీల్ లైఫ్‌! కళ్యాణ్ రామ్ - కాజల్ జంటగా ఉపేంద్ర డైరెక్షన్‌లో రానున్న
ఫిల్మ్ ‘ఎంఎల్ఏ’ దీనికి ట్యాగ్ లైన్ ‘‘మంచి లక్షణాలున్న అబ్బాయి’’.

శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్ సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. వీరభద్రాపురం ప్రజలు ట్యాప్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నది ఈ పోస్టర్ సారాంశం. ఇంతకీ ఈ పిక్‌ని ఎవరైనా క్రియేట్ చేశారా? లేక సినిమాలోనిదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఫుల్‌లెంగ్త్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో క‌ళ్యాణ్‌రామ్ న్యూలుక్‌లో క‌నిపించ‌నున్నాడు.

 

Read Also

 
Related News