India / Entertainment
హన్సిక ఆగ్రహం వెనుక..

హీరోయిన్ హ‌న్సికకు కోప‌ం తన్నుకొచ్చింది. ట్విట్టర్ వేదిక‌గా బాలీవుడ్ న‌టి హీనాఖాన్‌పై మండిపడింది. బాలీవుడ్ న‌టీనటులు చాలామంది సౌత్ ఇండ‌స్ట్రీలో ప‌నిచేశారు.. ఇంకా చేస్తూనేవున్నారు. సౌత్ హీరోయిన్స్‌ను త‌క్కువ చేసి మాట్లాడు తున్నందుకు సిగ్గుప‌డాలని, తాను ద‌క్షిణాది న‌టిగా చెప్పుకునేందుకు గ‌ర్వప‌డుతున్నానని తెలిపింది. హీనాఖాన్ మాట్లాడిన మాట‌లు ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదని ఒక్కముక్కలో తేల్చేసింది హ‌న్సిక.

స‌ల్మాన్ హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్- 11లో న‌టి హీనాఖాన్ కంటెస్టెంట్‌గా సెల‌క్ట్ అయింది. ఐతే, ఈ షోలో భాగంగా హీనాఖాన్ సౌత్‌భామ‌లపై నోరు పారేసుకుంది. సౌత్ హీరోయిన్స్ ఎక్స్‌పోజింగ్ బాగా చేస్తార‌ని, అందుకే వాళ్లని ప్రేక్షకులు ఎక్కువ‌గా ఇష్టప‌డ‌తారని తెలిపింది. అలాగే వెంకటేష్, మహేష్‌బాబుల గురించి ప్రస్తావించింది హీనా. దీనిపై హన్సిక కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయిన విషయం తెల్సిందే!

 

Read Also

 
Related News